కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. ఆ వర్సిటీలపై ఆరా

Siva Kodati |  
Published : Jun 22, 2022, 07:27 PM IST
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. ఆ వర్సిటీలపై ఆరా

సారాంశం

తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా జూనియర్ కాలేజీల్లో పనిచేస్తోన్న 3,580 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు సమర్పించిన సర్టిఫికెట్లపై ఆరా తీయనుంది.  

తెలంగాణలో జూనియర్ లెక్చరర్లు (junior lecturer) చదివిన యూనివర్సిటీల గుర్తింపుపై దృష్టి పెట్టింది ఇంటర్ బోర్డ్ (telangana inter board) . ఆయా యూనివర్సిటీలకు యూజీసీ గుర్తింపు వుందా లేదా అన్నది తేల్చాలని ఉన్నత విద్యా మండలిని కోరింది ఇంటర్ ఎడ్యుకేషన్ కమీషనరేట్. దీంతో రంగంలోకి దిగిన ఉన్నత విద్యా మండలి ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తోన్న 3,580 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పీజీ చేసినట్లు .. 60 యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు సమర్పించారు. 

డిస్టెన్స్ మోడ్‌లో కొందరు.. రెగ్యులర్‌గా కొందరు పీజీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆయా యూనివర్సిటీల్లో డిస్టెన్స్‌కు అనుమతి వుందా..? వుంటే దాని పరిధి ఎంత అన్నది పరిశీలించనుంది కమిటీ. నిన్న సమావేశమైన కమిటీ.. ఈ నెల 27న మరోసారి భేటీ కానుంది. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక.. అర్హులు , అనర్హుల జాబితా ఆధారంగా కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించే ప్రతిపాదనలను (contract lecturer regularisation in telangana) ప్రభుత్వానికి పంపనున్నారు ఇంటర్ విద్య కమీషనర్ . 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్