టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం: ఠాగూర్

By narsimha lodeFirst Published Dec 14, 2020, 4:05 PM IST
Highlights

టీపీసీసీకి కొత్త బాస్ ను ఎంపిక చేయడానికి మరికొంత సమయం పడుతోందని  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  చెప్పారు.

న్యూఢిల్లీ: టీపీసీసీకి కొత్త బాస్ ను ఎంపిక చేయడానికి మరికొంత సమయం పడుతోందని  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  చెప్పారు.

సోమవారం నాడు న్యూఢిల్లీలో మాణికం ఠాగూర్ మీడియాతో మాట్లాడారు.  పీసీసీకి కొత్త చీఫ్ పదవి కోసం 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు. తెలంగాణకు  చెందిన ఎఐసీసీ నేతల నుండి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తీసుకొన్నట్టుగా ఆయన వివరించారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించామన్నారు. ఈ అభిప్రాయాలను  సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తామన్నారు.

also read:పీసీసీకి కొత్త చీఫ్: సీనియర్ల ఢిల్లీ టూర్ వెనుక ఉద్దేశ్యమదేనా?

ఈ కసరత్తు పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతోందన్నారు ఠాగూరు. పీసీసీకి కొత్త చీఫ్ ఎవరుండాలో చెప్పాలని నేతలను కోరామన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పీసీసీ చీఫ్ ను పార్టీ నాయకత్వం ఎంపిక చేస్తోందని ఆయన చెప్పారు.

పీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తుపై ఇబ్బంది ఉంటే నేరుగా పార్టీ అధిష్టానాన్ని కలవాలని ఆయన సూచించారు. ప్రజాధరణ లేని నేతలే పార్టీని వీడుతున్నారన్నారు.అసలైన కాంగ్రెస్ నేతలెవరూ కూడ పార్టీని వీడే పరిస్థితుల్లో లేరని ఠాగూర్ ధీమాను వ్యక్తం చేశారు.

click me!