కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు

By telugu teamFirst Published Sep 22, 2019, 2:27 PM IST
Highlights

కానిస్టేబుల్ ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని, ఎక్కువరోజులు ఆలస్యం చేయబోమని తెలిపారు. త్వరలోనే అని చెబుతూనే, ఏకంగా డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఈ నెల 25వ తారీఖున విడుదలచేసేందుకు సదరు శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. 

హైదరాబాద్: అసెంబ్లీలో మాట్లాడుతూ కానిస్టేబుల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి కెసిఆర్ తీపికబురు చెప్పారు. కానిస్టేబుల్ ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని, ఎక్కువరోజులు ఆలస్యం చేయబోమని తెలిపారు. త్వరలోనే అని చెబుతూనే, ఏకంగా డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఈ నెల 25వ తారీఖున విడుదలచేసేందుకు సదరు శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. 

కెసిఆర్  స్పీచ్ వినగానే కానిస్టేబుల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల మొఖంలో ఆనందం వెల్లివిరిసింది. పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువగా ఉండే అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో విద్యార్థులు ఇప్పటికైనా తమ గోడును ప్రభుత్వం అర్థం చేసుకుందంటూ ఆనందం వ్యక్తం చేసారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా భర్తీ చేయనన్ని పోస్టులను తాము ఒక్క రిక్రూట్మెంటులోనే భర్తీ చేశామని కెసిఆర్ అన్నారు. 18వేల రిక్రూట్మెంట్ చేస్తే అందులో 2000మంది ఎస్సై అభ్యర్థులు కాగా, మిగిలిన 16వేల మంది కానిస్టేబుళ్లేనని తెలిపారు. 

తెలంగాణాలో వీరందరికి శిక్షణ ఇచ్చేందుకు స్థలం అందుబాటులో లేని కారణంగా 4వేల మందిని ట్రైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ కు పంపనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. 

click me!