కళ్లల్లో కారం కొట్టి.. సవతి తల్లిని కిరాతకంగా చంపిన కానిస్టేబుల్

Published : Apr 30, 2019, 10:28 AM ISTUpdated : Apr 30, 2019, 10:30 AM IST
కళ్లల్లో కారం కొట్టి.. సవతి తల్లిని కిరాతకంగా చంపిన కానిస్టేబుల్

సారాంశం

ఆస్తి కోసం సవతి తల్లిని ఓ కానిస్టేబుల్ అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం మాతన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి 2 నెలలు గడవక ముందే ఆస్తి కోసం సవతి తల్లిని అతి దారుణంగా నరికాడు. 

ఆస్తి కోసం సవతి తల్లిని ఓ కానిస్టేబుల్ అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం మాతన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి 2 నెలలు గడవక ముందే ఆస్తి కోసం సవతి తల్లిని అతి దారుణంగా నరికాడు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయబస్తీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

పూర్తి వివరాల్లోకివెళితే.. మాదన్నపేట్‌కు చెందిన యాదయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమారుడు శ్రీకాంత్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండో భార్యకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కాగా అనారోగ్యం కారణంగా  ఈ మధ్య కాలంలోనే యాదయ్య  చనిపోయాడు. దహన కార్యక్రమంలో కూడా కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆస్తి కోసం గొడవ పడటంతో స్థానిక పోలీసులు వచ్చి సముదాయించారు.
 
బతికి ఉన్నప్పుడే యాదయ్య..  శ్రీకాంత్‌కు బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో కోటి రూపాయల విలువ చేసే ఇల్లు, మాదన్నపేటలో మరో ఇల్లు ఇచ్చాడు.  కాగా తన తండ్రి రెండో భార్యకు ఇచ్చిన ఆస్తి కూడా తనకే కావాలని మంగళవారం ఉదయం మాదన్నపేట్‌లో ఉండే సవతి తల్లి ఇంటికి వచ్చి.. ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల కళ్లలో కారం చల్లి సవతి తల్లి సుకన్య మెడను కోసి అతి దారుణంగా ఆ కిరాతకుడు చంపేశాడు. 

కళ్ల ఎదుటే తల్లి హత్య చూసిన ఇద్దరు పిల్లలు భయబ్రాంతులకు గురై కోలుకోలేని పరిస్థితిలో పడిపోయారు. ఈ ఘటన జరిగిన అనంతరం కానిస్టేబుల్ పరారయ్యాడని తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?
Hidden Waterfall: బొగత కంటే క్రేజీ స్పాట్.. అడవిలో దాగున్న అద్భుత జలపాతం.. అడ్వెంచర్ లవర్స్‌కు పూనకాలే !