మొన్న గీతారెడ్డి.. నేడు కానిస్టేబుల్, రాహుల్ పాదయాత్రలో వరుస అపశృతులు

By Siva KodatiFirst Published Nov 5, 2022, 2:50 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో వరుస అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. మొన్న మాజీ మంత్రి గీతారెడ్డి కిందపడి గాయాల పాలవ్వగా.. ఇవాళ ఓ కానిస్టేబుల్ కాలి మీదుగా కారు దూసుకెళ్లింది. 
 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ భద్రతా విధుల్లో వున్న శివకుమార్ అనే కానిస్టేబుల్ కాలిపై నుంచి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెళ్లింది. దీంతో ఆయన గాయపడ్డారు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది శివకుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ వారం మొదట్లో రాహుల్ వెంట పాదయాత్రలో నడిచిన మాజీ మంత్రి గీతారెడ్డి రోడ్డుపై పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది గీతా రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. 

అంతకుముందు మంగళవారం కూడా భారత్ జోడో యాత్రలో చిన్నపాటి అపశృతిచోటుచేసుకుంది. రాహుల్ పాదయాత్రలో చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నితిన్ రౌత్‌కు గాయాలు అయ్యాయి. నితిన్ రౌత్ భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సమయంలో పోలీసులు నెట్టివేయడంతో ఈ ఘటన జరిగినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నితిన్ రౌత్ కుడి కన్ను, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాసవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ALso REad:భారత్ జోడో యాత్ర ... రాహుల్ గాంధీపై కేసు, కేజీఎఫ్ 2 వల్లే

ఈ విషయంపై దీక్ష రౌత్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నిన్న హైదరాబాద్‌లో మా నాన్న భారత్‌ జోడో యాత్రలో స్పృహ తప్పి పడిపోయారు. అతడి తలపై చిన్న గాయమైంది. ఆయన త్వరగా కోలుకుని మహారాష్ర్టకు భారత్ జోడో యాత్ర చేరుకున్నప్పుడు.. ఆ ప్రజా ఉద్యమంలో చేరతారని ఆశిస్తున్నాను’’ అని దీక్ష రౌత్ ట్వీట్ చేశారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్రాలను కూడా షేర్ చేశారు.   

click me!