రాములమ్మతో రేవంత్ భేటీ, తాజా రాజకీయాలపై చర్చ

By Nagaraju TFirst Published Nov 10, 2018, 7:00 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతీ ఒక్కరిలో నెలకొంది. వరుస మీటింగ్ లు, రహస్య సమావేశాలు ఆ పార్టీ కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీలలో వరుస సమావేశాలతో ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళానికి గురవుతున్నారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతీ ఒక్కరిలో నెలకొంది. వరుస మీటింగ్ లు, రహస్య సమావేశాలు ఆ పార్టీ కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీలలో వరుస సమావేశాలతో ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళానికి గురవుతున్నారు. 

అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతితో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తన వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేదని అలకబూనిన రేవంత్ రెడ్డి, రాములమ్మతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ ఇరు నేతలు దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. మహాకూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంకా జాబితాను ప్రకటించకుండానే నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, విజయశాంతి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చెలరేగుతున్న నిరసనలు, మహాకూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించాల్సిన సీట్లు వంటి అంశాలపై ఇద్దరు విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్‌లోని అసంతృప్తవాదుల ప్రభావం పార్టీపై పడకుండా తగు చర్యలు తీసుకోవాలని, టీఆర్ఎస్‌ను ఓడించాలన్న లక్ష్యం దెబ్బతినకుండా వ్యూహరచన చేయాలనే అంశాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. 

 ఇప్పటికే పలుమార్లు విజయశాంతి పార్టీకి మహాకూటమికి పలు సూచనలు చేశారు. మహాకూటమిలో ఇతర పార్టీల ఉనికిని కాపాడుకోవాలని అంతా కలిసి టీఆర్ఎస్ ను ఓడించాలని కోరారు. పార్టీలలో అసంతృప్తి రావద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయినా నిరసనలు, అసంతృప్తిలతో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో అవి పునరావృతం  కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

click me!