దొంగగా మారిన ఆటో డ్రైవర్... ఇంటర్నేషనల్ డెబిట్,క్రెడిట్ కార్డులు స్వాధీనం

By Arun Kumar PFirst Published Nov 10, 2018, 5:42 PM IST
Highlights

ఓ ఆటో డ్రైవర్ అత్యాశకు పోయి కటకటాలపాలయ్యాడు. రోడ్డుపై దొరికిన వస్తువులను భాదితులకు కానీ, పోలీసులకు అప్పగించకుండా తన వద్దే దాచుకుని దొంగగా మారాడు. ఇలా ఇతరుల సొత్తును ఆశించిన సదరు ఆటో డ్రైవర్‌ను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు పట్టుకున్నారు. 

ఓ ఆటో డ్రైవర్ అత్యాశకు పోయి కటకటాలపాలయ్యాడు. రోడ్డుపై దొరికిన వస్తువులను భాదితులకు కానీ, పోలీసులకు అప్పగించకుండా తన వద్దే దాచుకుని దొంగగా మారాడు. ఇలా ఇతరుల సొత్తును ఆశించిన సదరు ఆటో డ్రైవర్‌ను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు పట్టుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్ లో నివాసముండే ఓ వివాహిత తన కూతిరితో కలిసి ఈ నెల 3వ తేదీన స్థానికంగా ఉండే ఓ రెడీమేడ్ షాప్లో షాపింగ్ కు వెళ్లింది. అయితే ఆమె కారులోంచి దిగే క్రమంలో పర్స్  రోడ్డుపై పడిపోయింది. దీన్ని ఆమె గమనించకుండా తన కూతురిని తీసుకుని షాప్ లోకి వెళ్లిపోయింది.

ఆమె పర్స్ పడిపోయిన విషయాన్ని అక్కడే వున్న ఆటోడ్రైవర్ కేతావత్ అమర్ నాయక్(33) గమనించాడు. ఆ పర్స్ ‌ను తీసుకుని అక్కడినుండి చెక్కేశాడు. అయితే షాప్ లోకి వెళ్లిన తర్వాత తన పర్స్ కనిపించకపోవడంతో ఆమె కారు వద్దకు వచ్చి చూసింది. అక్కడ కూడా లేకపోవడంతో ఖంగారుపడిపోయిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ బట్టల షాప్ వద్ద గల సిసి కెమెరా రికార్డును పరిశీలించారు. ఇందులో ఆటో డ్రైవర్ అమర్ నాయక్ పర్స్ ను తీసుకున్నట్లు బైటపడటంతో అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇవాళ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్దనుండి బాధిత మహిళకు చెందిన ఇంటర్నేషనల్ డెబిట్,క్రెడిట్ కార్డులతో పాటు  85 గ్రాముల బంగారం గొలుసు, వెండి వస్తువులు, 120 డాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


 

click me!