కేసీఆర్‌ను ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి... ప్రయత్నం ఫలించేనా...?

First Published Feb 19, 2019, 8:07 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రాజకీయంగా బద్దశతృవులన్న విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ చేసినన్ని విమర్శలు మరెవరు చేసివుండరు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను కూడా కేసీఆర్ ముప్పుతిప్పలు పెట్టారు. ఇంకా  పెడుతూనే వున్నారు. ఇలా ఒకరిపై మరొకరు కత్తులు దూస్తున్న ఈ రాజకీయ ప్రత్యర్థులు ఓ విషయంలో మాత్రం ఒకేలా ఆలోచించారు. విభిన్న దృవాలుగా వుండే వారి ఆలోచనలు ఏ విషయంలో కలిసాయో తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. 

undefined
కేసీఆర్ కు దైవభక్తి ఎక్కవనే విషయం ఆయన చేసే హోమాలు, నమ్మే వాస్తుదోషాలు, సందర్శించే దేవాలయాలను బట్టి తెలుస్తుంది. అయితే ఇదే విషయంలో రేవంత్ సీఎం కేసీఆర్ ను ఫాలో అయ్యారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ కూడా తన ఇంట్లో హోమం నిర్వహించి, ఇంటి వాస్తును సరిచేశారు. రాజకీయంగా విరుద్దమైన ఆలోచనలు కలిగిన వీరిద్దరు భక్తి విషయంలో మాత్రం ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు రాజకీయంగా చర్చ మొదలయ్యింది.
undefined
రేవంత్ కు గతకొంత కాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కవడం, జైలుపాలవడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఇలా ఒకటితర్వాత మరొకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఓటుకు నోటు కేసు విచారణను ఈడీ చేపట్టడం రేవంత్ ను కలవరపెడుతోంది. దీంతో ఈ సమస్యలన్నింటి నుండి బయటపడేందుకు రేవంత్ భక్తి మార్గం పట్టినట్లు సమాచారం.
undefined
పండితుల సలహా మేరకు రేవంత్ రెడ్డి దంపతులు ఇటీవల మూడు రోజుల పాటు ఇంట్లో సుదర్శన హోమం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇలా మూడు రోజుల పాటు ఇంటికే పరిమితమైన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా హాజరవలేకపోయాట. దీంతో ఆయన గైర్హాజరీపై ఆరా తీయగా మరిన్ని విషయాలు బయటపడ్డాయి.
undefined
రేవంత్ కేవలం యాగమే కాకుండా కొత్త ఇంటికి వాస్తు దోషాలను సరిచేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పండితులు అందించిన వెండి కడియాన్ని కూడా ధరించారు. ఇలా రేవంత్ తన సమస్యల నుండి బయటపడేందుకు తన రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ బాటలో నడుస్తున్నారు.
undefined
click me!