58 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ.. రేపు ప్రకటించనున్న హైకమాండ్..

Published : Oct 14, 2023, 07:00 PM ISTUpdated : Oct 14, 2023, 07:01 PM IST
58 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ.. రేపు ప్రకటించనున్న హైకమాండ్..

సారాంశం

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముహుర్తం ఖరారు అయింది. 

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముహుర్తం ఖరారు అయింది. రేపు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్టుగా ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కె మురళీధరన్ చెప్పారు. తొలి జాబితాలో 58 మంది అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నట్టుగా చెప్పారు. విజయావకాశాలు, పార్టీకి విధేయత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్టుగా  తెలిపారు. 

కాంగ్రెస్ హైకమాండ్ రేపు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వామపక్షాలతో పొత్తులపై రేపు తుది నిర్ణయంవచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక, రేపు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుండటంతో అశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, ఏకాభిప్రాయంతో ఉన్న సీట్లను తొలిజాబితాలో ప్రకటించనున్నట్లు సమాచారం. చాలావరకు ముఖ్య నాయకులు పోటీ చేసే స్థానాలను తొలి జాబితాలోనే ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేరసిన సంగతి తెలిసిందే. సర్వేల నివేదికలు, ఆర్థిక బలం, పార్టీకి విధేయత, పార్టీ లో పనిచేసిన కాలం.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను కాంగ్రెస్ సీఈసీ ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ సీఈసీ సమావేశానికి ముందు.. అభ్యర్థుల జాబితాను రూపొందించడానికి స్క్రీనింగ్ కమిటీ పలు మార్లు సమావేశం నిర్వహించింది. ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించింది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌