కేసీఆర్ పై రేవంత్ పోటీ: ఈ నెల 10న కామారెడ్డికి సిద్దరామయ్య, బీసీ డిక్లరేషన్ విడుదల

By narsimha lode  |  First Published Nov 5, 2023, 2:51 PM IST

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల అస్త్రశస్త్రాలను  కాంగ్రెస్ ప్రయోగిస్తుంది.  కర్ణాటక ఫార్మూలాను తెలంగాణలో ఆ పార్టీ అమలు చేస్తుంది.



హైదరాబాద్: కామారెడ్డిలో   కాంగ్రెస్ పార్టీ ఈ నెల  10వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది.ఈ సభలో కర్ణాటక సీఎం  సిద్దరామయ్య పాల్గొంటారు.  ఇదే సభలో బీసీ డిక్లరేషన్ ను  సిద్దరామయ్య విడుదల చేయనున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  పోటీచేస్తున్నారు.  కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుంది. ఈ స్థానం నుండి  గతంలో  షబ్బీర్ అలీ  ప్రాతినిథ్యం వహించారు.అయితే ఈ దఫా  షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉంది.  

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  తొలిసారిగా  కేసీఆర్ పోటీ చేస్తున్నారు. కేసీఆర్ పై బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపాలనే లక్ష్యంతో  రేవంత్ రెడ్డిని బరిలోకి దింపుతుంది.  కొడంగల్ తో పాటు  కామారెడ్డిలో కూడ  రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే మూడో జాబితాలో  కామారెడ్డి పేరుండే అవకాశం ఉంది.

Latest Videos

undefined

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  రేవంత్ రెడ్డి  ఈ నెల  10న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.  కామారెడ్డి బహిరంగ సభలోనే  బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించనుంది.  

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే  బీసీ అభ్యర్ధిని సీఎంగా చేస్తామని  బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రకటించిన  మూడు జాబితాల్లో  బీసీ,   మహిళలకు పెద్దపీట వేసింది.  ఓసీలకంటే  బీసీలకు ఎక్కువ సీట్లను బీజేపీ కేటాయించింది.ఈ దఫా  ఎన్నికల్లో  గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుండి కూడ  కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు.  గజ్వేల్ లో  కాంగ్రెస్ తరపున నర్సారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగారు.  మరో వైపు కామారెడ్డి  నుండి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్ధిగా వెంకటరమణరెడ్డి పోటీ చేస్తున్నారు. 

also read:ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

తెలంగాణలో ఈ దఫా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. కర్ణాటక ఫార్మూలానే  తెలంగాణలో కూడ ఆ పార్టీ అవలంభిస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడ తెలంగాణలో విస్తృతంగా  ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య తొలిసారి ప్రచారానికి రానున్నారు.

click me!