నేడు విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు: రేవంత్ సహా కీలక నేతల హౌస్ అరెస్ట్

Published : Apr 07, 2022, 09:24 AM ISTUpdated : Apr 07, 2022, 10:19 AM IST
 నేడు విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు: రేవంత్ సహా కీలక నేతల హౌస్ అరెస్ట్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ ఇవాళ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.  

హైదరాబాద్: పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ Congress పార్టీ నేతలు గురువారం నాడు విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చారు. Hyderabad నెక్లె స్ రోడ్డులోని ఇందిరాగాంధీ  విగ్రహం నుండి వద్యుత్ సౌధ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా Electricity  కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు.

 హైద్రాబాద్ విద్యుత్ సౌధ ముట్టడిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ Revanth Reddy కోరారు. విద్యుత్ సౌధ ముట్టడి నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ నేతలు ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోనున్నారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఒకవేళ పోలీసుల కళ్లుగప్పి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఇంటి నుండి బయటకు వస్తే పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంది.  రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చే దారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌధను ముట్టడిస్తామని ముట్టడిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇదిలా ఉంటే విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులను వారి గుర్తింపు కార్డులను చూపించిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు.  మాజీ మం్రి షబ్బీర్ అలీ, పార్టీ అధికార  ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు.ఈ నెల 1వ తేదీ నుండి పెంచిన విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. డిస్కం కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకొనేందుకు గాను విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రతిపాదించాయి. అయితే ఈ ప్రతిపాదనలకు ERC ఆమోదం తెలిపింది.

 రూ. 10,928 కోట్ల రెవిన్యూ లోటును పూడ్చుకొనేందుకు గాను విద్యుత్ చార్జీల పెంపునకు గాను డిస్కం కంపెనీలు టారిఫ్ పెంపు ప్రతిపాదనలను  ఈఆర్సీసీకి అందించాయి.రూ.6831 కోట్లను చార్జీల పెంపు ద్వారా ఆర్జించాలని ప్రతిపాదనలను పంపాయి.గృహ వినియోగదారులకు  యూనిట్ కు 50 పైసలు, ఇతర వినియోగదారులకు యూనిట్ కు రూ. 1 పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమయిందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని  ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు చెబుతున్నారు. డిస్కం ప్రతిపాదనలకు ఈఆర్సీ అంగీకారం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్