తెలంగాణలో కాంగ్రెసు అలర్ట్: డికె సహా హైదరాబాదుకు ఢిల్లీ పెద్దలు

By Nagaraju TFirst Published Dec 10, 2018, 2:48 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అటు ఇటూ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంది. ఒక వేళ తక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. 
 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అటు ఇటూ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంది. ఒక వేళ తక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. 

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత కర్నాటక మంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రానికి డీకే శివకుమార్ హైదరాబాద్ కు రానున్నారు. డీకేతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు కూడా తెలంగాణ రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉంది. 

ఎన్నికల ఫలితాలు ప్రజాకూటమికి అనుకూలంగా వస్తే  సీఎం అభ్యర్థిపై ఈనేతలు వ్యూహరచన చేయనున్నారు. ఒక వేళ ఎన్నికల ఫలితాలు హంగ్ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన అసరాలు, ఇతర పార్టీలతో సంప్రదింపులు వంటి వ్యూహాలకు పదునుపెట్టనున్నారు. 

ఇప్పటిక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు పావులు కదుపుతుంది. అధికారానికి కాస్త దూరంలో ప్రజాకూటమి వచ్చి ఆగిపోతే ఏ పార్టీని సంప్రదించాలి, ఎవరెవరిని తమవైపుకు తిప్పుకోవాలి, ఇండిపెండెంట్లను ఎలా ఆకర్షించాలన్న ఆలోచనలపై కసరత్తు చేయనున్నారు. 

ఇప్పటికే ఆంధ్రా ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇండిపెండెంట్లు అత్యధిక సంఖ్యలో గెలవబోతున్నారు అంటే కనీసం 10 స్థానాల వరకు విజయం సాధిస్తారని ముందే లీకివ్వడంతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు వారితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. 

అయితే అటు అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం ఫలితాలపై ధీమాగా ఉంది. ఒకవేళ కాస్త అటూ ఇటూ అయితే ఇండిపెండెంట్లను తమవైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే కొందరు టీఆర్ఎస్ నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులకు టచ్ లో వెళ్లారని టాక్. 

మెుత్తానికి అటు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఫలితాలపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఓటరు దేవుడు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుందో అన్నది మంగళవారం తేలనుంది.

click me!