
హైదరాబాద్:Congress పార్టీ Medak పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి కీలక నేతలు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ membership నమోదు సమీక్ష సమావేశాలకు హాజరు కాని నేతలపై చర్యలు తీసకొంటామని గతంలోనే పార్టీ నాయకత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను ఆదివారం నాడు Gandhi Bhavan లో ఆ పార్టీ చేపట్టింది. మెదక్ పార్లమెంటరీ పార్టీ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి Geetha Reddy కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy లు గైర్హాజరయ్యారు.
మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షకు గీతారెడ్డి, Damodar Raja Narasimha కూడా హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. దామోదర రాజనర్సింహ కూడా కొంత కాలంగా Revanth Reddy తీరుపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. ఇవాళ సమీక్షకు ఆయన హాజరు కాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టైంది.తనకు సంబంధించిన అంశాల్లో కూడా సమాచారం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించడంపై దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతుంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరశైలిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ తీరుపై సోనియాగాంధీకి కూడా జగ్గారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ఈ నెల మూడో వారంలో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి కూడా పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఈ విషయమై టీపీసీసీ చీఫ్
రేవంత్ రెడ్డి కూడా పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ జరిగే పార్టీ సమీక్ష సమావేశాలకు డుమ్మా కొట్టే నేతలకు పీసీసీలో ఛాన్స్ ఉండదని తేల్చి చెప్పారు. అంతేకాదు తమకు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే పార్టీ నేతలకు కూడా పీసీసీలో చోటు ఉండదని కూడా రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు కూడా తమ టార్గెట్ లను పూర్తి చేయాలని కూడా రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పార్టీ సభ్యత్వాన్ని చేయాలని పీసీసీ నిర్ణయం తీసుకొంది. అయితే ఇప్పటివరకు సుమారు 20 లక్షల సభ్యత్వాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే మిగిలిన 10 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేయడం కోసం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సభ్యత్వాలను సమీక్షించనున్నారు.
గత ఏడాది డిసెంబర్ మాసంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. పార్టీ సభ్యత్వం తీసుకొన్న వారికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ ను కూడా ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. ఇవాళ్టితో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గడువు పూర్తి కానుంది. రాష్ట్రం నుండి 30 లక్షల మందిని సభ్యులుగా చేర్పిస్తామని రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి Shabbir Ali సుమారు 400 మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి సుమారు 20 వేల మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించారు. ప్రతి మండలంలో 15 వేల మందిని పార్టీలో సభ్యులుగా చేర్పించాలని రేవంత్ రెడ్డి టార్గెట్ ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని రేవంత్ పార్టీ నాయకులను కోరారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 3.5 లక్షల మందికి సభ్యత్వం ఇప్పించాలని కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది.