కరోనా ఎఫెక్ట్: మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు కన్నుమూత

By narsimha lodeFirst Published Apr 26, 2021, 8:11 PM IST
Highlights

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు సోమవారం నాడు మరణించారు.
 

కరీంనగర్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు సోమవారం నాడు మరణించారు.కరోనాతో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన సోమవారం నాడు మరణించారు.కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు ఆయన పనిచేశాడు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కరీంనగర్ ఎంపీ స్థానం నుండి ఆయన మూడు దఫాలు ఎంపీగా విజయం సాధించారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడ ఆయన పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎం. సత్యనారాయణరావు కొంతకాలం పాటు ఆర్టీసీ ఛైర్మెన్ గా కూడ పనిచేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పనిచేశారు.

కరీంనగర్ జిల్లాలో  విద్యార్ధి నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తొలి తెలంగాణ ఉద్యమంలో  ఎం సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఇందిరాగాంధీతో పాటు నెహ్రు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే అలవాటు ఉంది ఎంఎస్ఆర్‌కి.వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంఎస్ఆర్ విసిరిన ఛాలెంజ్ ఉప ఎన్నికకు కారణమైంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 

click me!