కొడంగల్‌లో కలకలం...కాంగ్రెస్ అభ్యర్థి కిడ్నాప్

By Arun Kumar PFirst Published Jan 9, 2019, 4:28 PM IST
Highlights

సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామ స్థాయి రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికలు గ్రామాల్లోని నాయకుల మధ్య చిచ్చును రాజేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్‌లో ఈ ఎన్నికలు కూడా రసవత్తంగా మారాయి. నామినేషన్ వేయడానికి సిద్దమైన ఓ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ జిల్లాలో కలకలం రేపింది.  నామినేషన్ వేయడానికి ఈ ఒక్కరోజే మిగిలివుండటం...తమ అభ్యర్థి కనడబకుండా పోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్ల గందరగోళం నెలకొంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గంలోని నిటూరు గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ తరపున ఫోటీచేసేందుకు  విశ్వనాథ్‌ అనే నాయకుడు సిద్దమయ్యాడు. ఇవాళ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు గడువు ముగుస్తుండటంతో విశ్వనాథ్ నామినేషన్ వేయడానికి అన్నీ సిద్దం చేసుకున్నాడు. ఇవాళ  అతడు నామినేషన్ వేయాల్సి వుంది. 

అయితే నిన్న రాత్రి ఇంట్లో పడుకున్న విశ్వనాథ్ తెల్లారేసరికి కనిపించకుండా పోయాడు. పొద్దున లేచేసరికి అతడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు.  

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ పై సమాచారం అందుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నెట్టూరు గ్రామానికి వెళ్లారు. కిడ్నాప్ కు గురయిన కుటుంబ సభ్యలును అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు. నామినేషన్ వేయడానికి ఇవాళే చివరిరోజు కావడంతో విశ్వనాథ్ ను ఫోటీ నుండి తప్పించేందుకు ప్రత్యర్థులే ఈ పని చేసి వుంటారని కుటంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు రేవంత్ కు తెలిపారు. దీంతో వెంటనే ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఈ కిడ్నాప్ గురించి ఫిర్యాదు చేశారు.  

దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విశ్వనాథ్ కోసం గాలింపు చేపట్టారు. రాజకీయ కక్ష్యతో ఈ కిడ్నాప్ జరిగిందా లేదా విశ్వనాథ్  వ్యక్తిగత శతృవులు ఎవరైనా ఈ పని చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

click me!