కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం: బీజేపీలో చేరకముందే వేటు వేయాలని నిర్ణయం

By Nagaraju penumalaFirst Published Jul 4, 2019, 10:24 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి ముగింపు పలకాలని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 6న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీలో చేరే ముందే అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోపాటు ఏఐసీసీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధమైంది. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకముందే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై దృష్టి సారించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పూర్తి వివరాలు కావాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యహారంపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమించిన సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం నివేదికలో పొందుపరిచింది. 

తన నియోజకవర్గంలో గెలవలేని వ్యక్తి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారంట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై కూడా పూర్తి నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. 

click me!