నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగాలు లేవు, టీఆర్ఎస్ నేతల్ని తరిమి కొట్టండి: ఉత్తమ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 19, 2021, 4:37 PM IST
Highlights

నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని స్పష్టం చేశారు.

టీఎస్‌పీఎస్‌లో కూడా ఛైర్మన్.. సభ్యుల నియామకం కూడా లేదని ఉత్తమ్ మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే టీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దని ఆయన సూచించారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వని టీఆర్ఎస్‌ని ఓడించాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఓట్లు అడగటానికి టీఆర్ఎస్ నాయకులు వస్తే తరిమి కొట్టాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌ని ఓడిస్తే ఉద్యోగుల ఫిట్‌మెంట్ 7 శాతం నుంచి 43 శాతానికి పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాడిలా అరుస్తున్నారని... పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యల్ని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు.

భద్రాద్రి రాముడి భూములు ఆంధ్రాకు అప్పగించిన ఘనత బీజేపీదేనని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. 

click me!