మంత్రి జగదీశ్ రెడ్డిని ‘‘ బాహుబలి ’’ అన్న సూర్యాపేట ఎస్పీ.. ఆ కలెక్టర్‌‌ను గుర్తుచేస్తూ ఉత్తమ్ సెటైర్లు

Siva Kodati |  
Published : Sep 16, 2022, 08:35 PM ISTUpdated : Sep 16, 2022, 08:41 PM IST
మంత్రి జగదీశ్ రెడ్డిని ‘‘ బాహుబలి ’’ అన్న సూర్యాపేట ఎస్పీ.. ఆ కలెక్టర్‌‌ను గుర్తుచేస్తూ ఉత్తమ్ సెటైర్లు

సారాంశం

మంత్రి జగదీశ్ రెడ్డిని సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ బాహుబలి అంటూ పొగడటంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యారని.. మంత్రిని ప్రశంసించిన ఎస్పీ ఏమవుతారంటూ ఉత్తమ్ సెటైర్లు వేశారు. 

సూర్యాపేట జిల్లా ఎస్పీపై టీపీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డిని బాహుబలి అంటూ సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పొగడటంపై ఆయన ఫైరయ్యారు. సూర్యాపేట ఎస్పీ తీరు సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యారని.. మంత్రిని ప్రశంసించిన ఎస్పీ ఏమవుతారంటూ ఉత్తమ్ సెటైర్లు వేశారు. 

ALso REad:కేసీఆర్‌కు పాదాబివందనం చేసిన సిద్దిపేట కలెక్టర్

కాగా.. గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా వున్న వెంకట్రామ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు పాదాబివందనం చేయడం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని గతేడాది జూన్ 20న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ సమయంలో నూతన కలెక్టరేట్ లోని తన చాంబర్ లోని ఆసీనులైన తర్వాత కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి సీఎం పాదాలకు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులను కేసీఆర్ కు ఆయన పరిచయం చేశారు. తర్వాత కొద్దిరోజులకే వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR