తెలంగాణలో ఆ నలుగురే శ్రీమంతులు: మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న రేవంత్ రెడ్డి

By Nagaraju penumala  |  First Published Dec 14, 2019, 2:47 PM IST

ప్రధాని నరేంద్రమోదీ కేవలం బీజేపీ దాని అనుబంధ పార్టీల సభ్యులకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నారని మిగిలిన వారికి ఇవ్వడం లేదన్నారు. తాము సమస్యలపై కలుద్దామంటే ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 


 హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను విన్నవించుకునేందుకు మోదీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే ఇవ్వడం లేదని ఆరోపించారు. 

ఢిల్లీలో కేంద్రప్రభుత్వ వైఫల్యాలు, రైతు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన భారత్ బచావో ర్యాలీలో పాల్గొన్న రేవంత్ మోదీ నియంతృత్వ విధానాలను అవలంభిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

Latest Videos

undefined

ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మోదీ నియంతృత్వ పోకడలను ఎండగట్టేందుకు తాము భారత్ బచావో ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలు దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. దేశాన్ని ఆర్థికమాంద్యం పట్టిపీడించడానికి నోట్ల రద్దే కారణమని ఆరోపించారు రేవంత్ రెడ్డి. 

ప్రధాని నరేంద్రమోదీ కేవలం బీజేపీ దాని అనుబంధ పార్టీల సభ్యులకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నారని మిగిలిన వారికి ఇవ్వడం లేదన్నారు. తాము సమస్యలపై కలుద్దామంటే ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 
 
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ రాచరిక పాలనలో తెలంగాణ బందీ అయిందంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ తెలంగాణను దోచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

కేసీఆర్ దోపిడీ ఆపితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పల తెలంగాణగా మార్చేశారంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురు మాత్రమే శ్రీమంతులు అయ్యారని విమర్శించారు. అయితే రాష్ట్రం మాత్రం దివాలా తీసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

click me!