మూఢనమ్మకాల పిచ్చితో ప్రజాధనం దుర్వినియోగం: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ధ్వజం

Published : Jul 01, 2019, 04:43 PM IST
మూఢనమ్మకాల పిచ్చితో ప్రజాధనం దుర్వినియోగం: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ధ్వజం

సారాంశం

సచివాలయ భవనాల కూల్చివేతను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తుందన్న రేవంత్ రెడ్డి అవసరమైతే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కూడగట్టి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఎంపీ రేవంత్ రెడ్డి.  

హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ మూఢనమ్మకాల పిచ్చితో పాలన సాగిస్తున్నట్లున్నారని ఆరోపించారు. మూఢనమ్మకాల పిచ్చితోనే సచివాలయాన్ని కూల్చివేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.  

ఆధునిక పరిజ్ఞానంతోనే ప్రస్తుత సచివాలయాన్ని నిర్మించారని 100 ఏళ్లు కోసం నిర్మించిన సచివాలయంలోని ఏ భవనం కనీసం 30 ఏళ్లు కూడా ఉపయోగించలేదన్నారు. కేసీఆర్‌ తన మూఢ నమ్మకాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాదాపు రూ. వెయ్యి కోట్ల విలువైన భవనాలను కూలగొడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం సచివాలయం ఉండగా నూతన సచివాలయాన్ని నిర్మించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరింబోదన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా అమరవీరుల స్మారకానికి పునాదిరాయి పడలేదు కానీ, ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకుంటారంట అంటూ విరుచుకుపడ్డారు.  

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన విధ్యాభవనాలు నిర్మించాలని సవాల్ విసిరారు. సచివాలయాన్ని కూల్చడంపై న్యాయస్థానంలో ప్రజావ్యాజ్యం వేసినట్లు తెలిపారు. 

సచివాలయ భవనాల కూల్చివేతను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తుందన్న రేవంత్ రెడ్డి అవసరమైతే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కూడగట్టి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఎంపీ రేవంత్ రెడ్డి.  

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్