రేవంత్ రెడ్డికి కరోనా: ఐసోలేషన్‌లో కాంగ్రెస్ నేత

Published : Mar 23, 2021, 03:08 PM ISTUpdated : Mar 23, 2021, 03:25 PM IST
రేవంత్ రెడ్డికి కరోనా: ఐసోలేషన్‌లో కాంగ్రెస్ నేత

సారాంశం

మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా  రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.  

హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా  రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్ లోకి వెళ్తున్నట్టుగా ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారితో పాటు తనతో ఉన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.


 

రాష్ట్రంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  విద్యాసంస్థల్లో విద్యార్ధులు ఎక్కువగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో 8వ తరగతి వరకు విద్యా సంస్థలను మూసివేయాలని వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖకు సూచించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనాపై సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ కూడ బయట తిరగవద్దని ఆయన  కోరారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్