ఇంజనీర్‌కున్నంత జ్ఞానం కూడా లేదే.. ఇది ధనదాహమా: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

Siva Kodati |  
Published : Oct 21, 2020, 05:44 PM IST
ఇంజనీర్‌కున్నంత జ్ఞానం కూడా లేదే.. ఇది ధనదాహమా: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రమాదంపై ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రమాదంపై ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

సాగు నీటి ప్రాజెక్టుల గురించి తనకంటే తెలిసినోడు ఎవడని ప్రశ్నించే కేసీఆర్‌కు కల్వకుర్తి లిఫ్ట్ స్కీంలో ఓ ఇంజనీర్‌కు ఉన్నంత జ్ఞానం కూడా లేదే అంటూ ఎద్దేవా చేశారు.

ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లిఫ్ట్ పంపుల్లో ప్రకంపనలపై హెచ్చరిస్తూ ఎస్ఈలు రాసిన లేఖలను తన ట్వీట్‌కు జోడిస్తూ... వాస్తవాలు ఇవిగో అని పేర్కొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి లిప్ట్ దగ్గర ప్రమాదం చోటుచేసుకోవడంతో... మోటార్ నుంచి భారీ శబ్దం వచ్చి పంప్ హౌజ్‌‌లో పేలుడు సంభవించింది.

దీంతో పంప్ హౌజ్‌లో 45 అడుగులకు పైన నీరు చేరింది. ఈ ప్రమాదంపై రాజకీయంగానూ పెను దుమారం చెలరేగుతోంది. అధికార పార్టీ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

దీనిని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేత డీకే అరుణతో పాటు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్‌లను పోలీసులను మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. 

 


 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu