ఎల్ఆర్ఎస్‌ రద్దు చేయాలని హైకోర్టులో కోమటిరెడ్డి పిటిషన్

By narsimha lodeFirst Published Sep 14, 2020, 7:49 PM IST
Highlights

ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్  దాఖలు చేశాడు. ఎల్ఆర్ఎస్ పై ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.

హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్  దాఖలు చేశాడు. ఎల్ఆర్ఎస్ పై ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.

ఎల్ఆర్ఎస్ వల్ల పేద, మద్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఆ పిటిషన్ లో ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు ఎంపీ వెంకట్ రెడ్డి.ఎల్ఆర్ఎస్ పై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించే అవకాశం లేకపోలేదు.

also read:ఎల్ఆర్ఎస్ పై 131 జీవో రద్దుకి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్

అనుమతులు లేకుండా వెంచర్లు చేయడానికి అధికారులు ఎలా అనుమతిచ్చారని  ఎంపీ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పులకు సామాన్యులను బలి చేయడం సరికాదని కాంగ్రెస్ నేత అభిప్రాయపడుతున్నారు.

గత నెల 31వ తేదీన భూముల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అయితే భూముల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో కారణంగా పేదల జేబులకు చిల్లు పడే అవకాశం ఉందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

click me!