జహిరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడి వీరంగం... ఓటర్ ని  కాలితో తంతూ అవమానం...

Published : May 13, 2024, 01:19 PM ISTUpdated : May 13, 2024, 01:45 PM IST
జహిరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడి వీరంగం... ఓటర్ ని  కాలితో తంతూ అవమానం...

సారాంశం

అధికార కాంగ్రెస్ నేత ఒకరు ఓటర్ పై దాడికి పాల్పడిన ఘటన జహిరాబాద్ లోక్ సభ పరిధిలో వెలుగుచూసింది. స్వయంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సోదరుడే సహనం కోల్పోయి ఓటర్ ను అవమానించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓటర్లపై రాజకీయ నాయకుల దౌర్జన్యం పెరిగిపోయింది. కుదిరితే అభిమానంతో... లేదంటే డబ్బులు, కానుకలతో...అదీ కుదరకుంటే దౌర్జన్యంతో ఓటర్లను తమవైపు తిప్పుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా ఓటర్లపై నాయకులు దాడికి పాల్పడిన ఘటనలు వెలుగుచూసాయి. 

 తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో ఇవాళ కీలక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ప్రజలు తమకు ఇష్టమున్న పార్టీకి, అభ్యర్థికి ఓటేసేందుకు వెళుతున్నారు. ఇలా జహిరాబాద్ లోక్ సభ పరిధిలో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో అధికారం కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు ఈ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా వ్యవహరించారు.  

తన సోదరుడు సురేష్ షెట్కార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో జహిరాబాద్ లోక్ సభ పరిధిలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు నగేష్ షెట్కార్. ఈ క్రమంలోనే ఆయన ఓటర్ పై దాడికి పాల్పడ్డారు. కారణమేంటో తెలీదుగానీ ఓటర్ ను నగేష్ షెట్కార్ కాలితో తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంపీ అభ్యర్థి సోదరుడి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 


 

  
 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం