టీవీ9 వివాదం: క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హీరో శివాజీ

Published : Jun 11, 2019, 08:04 PM IST
టీవీ9 వివాదం: క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హీరో శివాజీ

సారాంశం

ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు.  వాదనలు విన్న ధర్మాసనం వచ్చే మంగళవారానికి కేసు విచారణను వాయిదా వేసింది. తాజాగా, శివాజీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్‌: తెలుగు సినీ హీరో శివాజీ మంళగవారం తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. తనపై తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన ఆ పిటిషన్‌ దాఖలు చేశారు. 

అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదుతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తోపాటు శివాజీపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాల్సిందిగా వీరిద్దరికీ నోటీసులు కూడా ఇచ్చారు. 

కాగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు.  వాదనలు విన్న ధర్మాసనం వచ్చే మంగళవారానికి కేసు విచారణను వాయిదా వేసింది. తాజాగా, శివాజీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

PREV
click me!

Recommended Stories

ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?