ఆ మార్గంలో రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ఉపయోగం లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Published : Sep 12, 2022, 11:56 AM ISTUpdated : Sep 12, 2022, 12:30 PM IST
ఆ మార్గంలో రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ఉపయోగం లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సారాంశం

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీషర్ట్‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీషర్ట్‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రాహుల్‌ను ఏం విమర్శించాలో అర్థంకాక.. ఆయన ధరించిన టీషర్ట్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మరి అలాంటప్పుడు రోజుకు 20 లక్షల రూపాయల డ్రెస్‌లు వేసినప్పుడు ఏమైందని ప్రశ్నించారు. మోదీ రోజుకు మూడు డ్రెస్సులు మార్చి రూ. 60 లక్షల ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో మోదీ సోకులు పడుతున్నారని విమర్శించారు. శంషాబాద్ నుంచి ముత్తంగా వరకు ఓఆర్‌ఆర్‌పై రాహుల్ పాదయాత్ర వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. 

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి నియోజకవర్గంలో 30 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందన్నారు. అయితే ఓఆర్ఆర్ మీదుగా రాహుల్ గాంధీ  పాదయాత్ర సాగడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. శంషాబాద్ ,రాజేంద్రనగర్ , మెహాదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లి , సంగారెడ్డి మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండేలా చూడాలని పీసీసీని కోరుతానని చెప్పారు.

రాహుల్ టీ షర్ట్‌‌పై వివాదం..
దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకనే నినాదంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేయనున్నారు. అయితే ఈ యాత్రలో రాహుల్ ధరించిన ఓ టీ షర్ట్‌పై వివాదం చెలరేగింది. రాహుల్ ‘బర్ బెర్రీ’ టీ షర్ట్ ధరించారన.. దాని విలువ ఏకంగా రూ.41వేలు అంటూ…బీజేపీ ట్విట్టర్లో పోస్టు చేసింది.  రాహుల్ ఆ టీ షర్ట్ తో ఉన్న ఫోటోతో పాటు, పక్కనే ఆన్‌లైన్‌లో అలాంటి టీ షర్ట్ ధరను తెలుపుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ… ‘భారత్, దేఖో’!  అంటూ పోస్ట్ చేసింది.

కాగా, ఈ పోస్టుపై కాంగ్రెస్ సైతం ధీటుగానే సమాధానమిచ్చింది.  ప్రధాని మోడీ ధరించిన సూట్ ధరను గుర్తు చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ను చూసి భయపడి పోతున్నారా? నిరుద్యోగం, ద్రవ్యోల్బణం  ఇలాంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. అదే దుస్తుల గురించి మాట్లాడాల్సి వస్తే… మోదీజీ రూ.10 లక్షల సూట్, రూ.1.5ల లక్షల కళ్ళజోడు గురించి మాట్లాడాల్సి వస్తుంది.. అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?