కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ... చేరిక చర్చలేనా?

By Arun Kumar PFirst Published Mar 13, 2019, 2:33 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌ ఇప్పటికే  ఘోరంగా దెబ్బతింది. ఇది చాలదన్నట్లు ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు లతో మరో గిరిజన మహిళా ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కూడా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ హరిప్రియ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో హరిప్రియ టీఆర్ఎస్ చేరికపై చర్చించినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్ పై ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో హరిప్రియ టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైందని ఆమె అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 

అయితే ఈ భేటీ అనంతరం హరిప్రియ మాట్లాడుతూ తన నియోజకవర్గ సమస్యలపై చర్చిచేందుకునే ముఖ్యమంత్రికి కలిసినట్లు వెల్లడించారు. సమస్యలతో సతమతమవుతున్న ఇల్లందు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరినట్లు...అందుకు ముఖ్యమంత్రి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారన్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే తన భవిష్యత్ నిర్ణయాలుంటాయని హరిప్రియ తెలిపారు.  

ఇప్పటికే ముగ్గురు  కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేలతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య,రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను  తమవైపు తిప్పుకోవడం ద్వారా టీఆర్ఎస్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ లేకుండా చేసింది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది.   
   
click me!