తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతల అరెస్ట్

By narsimha lodeFirst Published Jun 6, 2019, 5:08 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ ఇవ్వడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన దీక్షకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ ఇవ్వడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన దీక్షకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ  కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి,  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేతలు షబ్బీర్ అలీ‌లు అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగారు.

ధర్నాకు దిగిన  కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ నేతలను టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరో వైపు ఇదే డిమాండ్‌తో గాంధీ భవన్ ఎదుట ధర్నాకు దిగారు.ధర్నాకు దిగిన వి. హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

click me!