తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

By telugu news teamFirst Published Mar 19, 2020, 8:27 AM IST
Highlights

జిల్లాల్లో కరోనా ప్రభావం లేదని చెప్పిన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ ఫాంహౌజ్‌‌లో సేద తీరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ప్రజలు ఎక్కడికి వెళ్లాలో కేసీఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది. కేవలం ఒక్క రోజులో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 13మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్థారించారు. ఈ నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి మండిపడ్డారు.

Also Read తెలంగాణలో హై అలర్ట్..13కి చేరిన కరోనా కేసులు.. ఒక్కరోజులోనే...

జిల్లాల్లో కరోనా ప్రభావం లేదని చెప్పిన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ ఫాంహౌజ్‌‌లో సేద తీరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ప్రజలు ఎక్కడికి వెళ్లాలో కేసీఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

‘‘తెలంగాణలో రోజుకొకటిగా కరోనా కేసుల పెరుగుదల నమోదు ప్రకటించబడుతూ ఉంది. హైదరాబాదులో ఈ సమస్య ఉంటుందని, జిల్లాల్లో అంతగా ఉండదని.. ప్రకటించిన సీఎం, తమ భద్రత దృష్ట్యా రాజధానిలోని తమ అధికార నివాసం ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ దగ్గర ఫాంహౌస్‌లో ఉంటున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. మరి రాజధానిలోని సామాన్యులు ఎక్కడికి వెళ్లి తమ ప్రాణాలు రక్షించుకోవాలో కెసిఆర్ చెబితే బాగుంటుంది. ముఖ్యమంత్రి వెంటనే రాజధానికి వచ్చి, అధికార యంత్రాంగానికి అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వ చర్యలను నేరుగా పర్యవేక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’’ అని రాసుకొచ్చారు.

click me!