తెగదెంపుల దిశగా టీఆర్ఎస్- ఎంఐఎం: రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 22, 2020, 07:49 PM IST
తెగదెంపుల దిశగా టీఆర్ఎస్- ఎంఐఎం: రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌‌పర్సన్ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మొత్తం మైనార్టీలు టీఆర్ఎస్- ఎంఐఎంలు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు.

టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌‌పర్సన్ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మొత్తం మైనార్టీలు టీఆర్ఎస్- ఎంఐఎంలు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపుతామన్న.. ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఓట్ల కోసమేనని విజయశాంతి వ్యాఖ్యానించారు. 

మరోవైపు విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఏ రోజు అనేదే తేలాల్సి ఉంది. బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటికే మూడుసార్లు ఆమెతో చర్చలు జరిపింది.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఇటీవల భేటీ కాగా, అంతకుముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండుసార్లు సమావేశమయ్యారు.

ఈ మూడు సందర్భాల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ చేస్తున్న పోరాటాలను రాములమ్మ ప్రశంసించినట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలపై సంజయ్‌ దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, ఆమె కూడా ఇదే పంథా కోరుకుంటున్నట్లు తెలిసింది

PREV
click me!

Recommended Stories

బిఆర్ఎస్ అకౌంట్లో రూ.1400 కోట్లు... ఎలా వచ్చాయి? : నిలదీసిన మంత్రి వివేక్
మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu