పార్టీ నుండి పోతున్నా అనే వారితో ఏం మాట్లాడుతాం: కోమటిరెడ్డి వ్యాఖ్యలపై వీహెచ్

By narsimha lode  |  First Published Jul 25, 2022, 10:22 PM IST

పార్టీ నుండి పోతున్నా అనే వారితో ఏం మాట్లాడుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీ మారడం చారిత్రక అవసరమని ప్రకటించిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు. 


హైదరాబాద్:  పార్టీనుంచి పోతున్నా అనే వారితో ఏం మాట్లాడుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. V.Hanumantha Rao  చెప్పారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు.

ఈ విషయమై ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీతో మాట్లాడారు..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీ మారాలనే నిర్ణయం  సరైంది కాదన్నారు.. Telangana లో  TRS  ను ఓడించే బలం బీజేపీకి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడించే శక్తి బీజేపీకి ఉందని  మా పార్టీ ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడితే నేనేంమాట్లాడుతానన్నారు. రాజగోపాల్ రెడ్డి  బీజేపీలోకి వెళ్లిపోతే  సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  కూడా నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో అధిష్టానంతో మాట్లాడాలన్నారు. ఈ విషయాలపై తాను పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చిస్తానని ఆయన చెప్పారు.

Latest Videos

undefined

also read:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో వరుస భేటీలు: కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ మీటింగ్

తాను పార్టీని వీడుతాననే ఆవేదనతో భట్టి విక్రమార్క తన ఇంటికి  వచ్చారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.నిన్న మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన రాజగోపాల్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. కేసీఆర్ ను ఓడించడం చారిత్రక అవసరంగా పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకి ఉందని చెప్పారు. గతంలో తాను చెప్పినట్టుగానే బీజేపీ బలం పుంజుకొందన్నారు. జీహెచ్ఎంసీ,  దుబ్బాక,హుజూరాబాద్, ఉప ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు.

click me!