వైఎస్‌ను పీసీసీ చీఫ్‌ను చేసింది నేనే: వీహెచ్

By narsimha lodeFirst Published Aug 12, 2019, 1:35 PM IST
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి,. హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసింది నేనే.... బతికున్నంత కాలం వైఎస్ఆర్ తనను పల్లెత్తు మాట అనలేదని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు గుర్తు చేసుకొన్నారు.

ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు పలు విషయాలను వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసింది తానేనని ఆయన  చెప్పారు. 

 ఆవేశంలో తాను ఏదైనా సందర్భంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేసినా కూడ ఆయన తనను ఒక్కమాట కూడ అనలేదన్నారు.పీజేఆర్, వైఎస్ఆర్ మధ్య గొడవలు జరిగిన సమయంలో కూడ వారిద్దరి మధ్య సఖ్యత కోసం తాను ప్రయత్నించినట్టుగా  హనుమంతరావు గుర్తు చేశారు.

ప్రస్తుత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలను తానే కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సహించినట్టుగా  వి.హనుమంతరావు గుర్తు చేసుకొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పలువురు నేతలను తాను ప్రోత్సహించినట్టుగా ఆయన చెప్పారు.  వైఎస్ జగన్ కూడ తనను గౌరవిస్తారని వి.హెచ్ చెప్పారు. జగన్ పాలనపై ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. ఏడాది తర్వాతే పాలనపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. 

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే రోజునే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసుకొంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పినా కూడ తాను ఎంపీగా వెళ్లినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్, చంద్రబాబులను బీజేపీ వదలదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. లేకపోతే బీజేపీ అన్ని పార్టీలను ఖాళీ చేస్తోందన్నారు.

 

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ నుంచి నాకు ఆఫర్లు, పార్టీ నుంచి పంపాలనుకుంటున్నారు: విహెచ్

కోమటిరెడ్డి రాజగోపాల్ పై విహెచ్ పరోక్ష దండయాత్ర

click me!