కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ... రైతుల భూములతో ప్రభుత్వం ‘‘రియల్’’ వ్యాపారం : షబ్బీర్ అలీ విమర్శలు

By Siva KodatiFirst Published Jan 5, 2023, 3:35 PM IST
Highlights

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. ప్రజలు రోడ్డెక్కినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్న ఆయన.. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు , రైతులు ఆందోళనకు దిగడంతో వారికి మద్ధతుగా రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీ.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వానపడ్డట్లే వుందన్నారు. కామారెడ్డిలో రైతుల ధర్నాలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో 620 ఎకరాల్ని ఇండస్ట్రీ జోన్‌లో కలిపారని షబ్బీర్ అలీ అన్నారు. 

రైతుల ఆందోళనపై కనీసం కలెక్టర్ స్పందించకపోవడం దారుణమని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని.. రైతులు తమ ఆందోళనపై మంత్రి కేటీఆర్‌కు లేఖ కూడా రాశాడని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. కామారెడ్డి మధ్యలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. రైతుల భూములు తీసుకుని గ్రీన్ జోన్ పెడతారా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. 

ALso REad: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల ఆందోళన..స్పందించిన కేటీఆర్, మున్సిపల్ కమీషనర్‌పై ఆగ్రహం

అంతకుముందు కామారెడ్డి  కొత్త మాస్టర్ ప్లాన్ ను  వెంటనే వెనక్కి తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద  గురువారంనాడు  రైతులు ఆందోళన నిర్వహించారు . కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు  రైతులు  ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  పరిధిలోకి  ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది గ్రామాలను చేర్చారు.ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములను సేకరించి  ఇండస్ట్రీయల్ కారిడార్ కు  కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనోపాధిని కల్పించే  భూములను ఇవ్వబోమని రైతులు  చెబుతున్నారు.  

మరోవైపు.. తన భూమి పోతోందనే భయంతో రాములు అనే రైతు  నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ ఎనిమిది గ్రామాల రైతులు  ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని  ఆందోళనకు దిగారు. తాము భూములను  వదులుకొనే ప్రసక్తేలేదని  రైతులు చెప్పారు.ఇదిలా ఉంటే  రైతులకు మద్దతుగా  బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు , ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  రవీందర్ రెడ్డిలు సైతం  ధర్నాలో  పాల్గొన్నారు. 

ALso REad: కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్: కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన, ఉద్రిక్తత

ఈ క్రమంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకొచ్చిందని మున్సిపల్ కమీషనర్‌ను ఆయన ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్‌లో వుందని ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్‌పై కొందరు ఆందోళన చేస్తున్నారని.. ఈ ప్రభుత్వం ఎవరినో ఇబ్బంది పెట్టడానికి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు సాయం చేసేందుకే వున్నామని... నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ అని మంత్రి అన్నారు. 
 

click me!