జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్, కాంగ్రెస్ నేతకు నోటీసు

By narsimha lodeFirst Published 20, Feb 2019, 6:17 PM IST
Highlights

ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను విచారణకు రావాలని  పోలీసులు బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్:ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను విచారణకు రావాలని  పోలీసులు బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.

బుధవారం నాడు రాకేష్ రెడ్డితో సంబంధాలు ఉన్న ఇద్దరు పోలీసు అదికారులను కూడ పోలీసులు విచారించారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి 2004 నుండి 2009 వరకు కూన శ్రీశైలం గౌడ్ ప్రాతినిథ్యం వహించారు. జయరామ్ హత్యకు ముందు రోజు కూన శ్రీశైలం గౌడ్‌ను రాకేష్ రెడ్డి కలిశారని పోలీసులు గుర్తించారు.

ఈ కేసు విషయమై ఈ నెల 22వ తేదీన హాజరుకావాలని  పోలీసులు శ్రీశైలం గౌడ్ కు నోటీసులు పంపారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి శ్రీశైలం గౌడ్ ఓటమి పాలయ్యాడు. శ్రీశైలం గౌడ్‌తో పాటు  మరికొందరు టీడీపీ నేతలను కూడ పోలీసులు విచారణకు  పిలిచే అవకాశం ఉందని  ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య: 'ఆదిభట్ల భూ వివాదం కోసమే ఫోన్ చేశా'

 

Last Updated 20, Feb 2019, 6:17 PM IST