భారత్ జోడో యాత్ర: భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న రాహుల్

By narsimha lodeFirst Published Oct 2, 2022, 2:08 PM IST
Highlights

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకొంటారు  ఈ నెల 24 వ తేదీన  కర్ణాటక నుండి యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  తెలంగాణ పర్యటనలో భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకోనున్నారు. ఈ ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేయ,నున్నారు.భారత్ జోడో యాత్ర చార్మినార్ మీదుగా సాగనుంది.ఈ నెల 24వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ మీదుగా భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలోని మక్తల్ నియోజకవర్గం గుండా తెలంగాణలోకి రాహుల్ గాంధీయాత్ర తెలంగాణలోకి రానుంది. ఈ యాత్ర రూట్ మ్యాప్ ను శనివారం నాడు  డీజీపీకి అందించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.  తెలంగాణ నుండి ఈ యాత్ర మహరాష్ట్రలోకి ప్రవేశించనుంది. మక్తల్ నుండి  దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్, ఆరాంఘర్  మీదుగా పాతబస్తీలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.  

గతంలో హైద్రాబాద్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నిర్వహించిన సద్భావన  ర్యాలీ సాగిన రూట్ లోనే  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగనుంది. హైద్రాబాద్ నగరంలోని చార్మినార్, నాంపల్లి, మొజాంజాహి మార్కెట్, గాంధీభవన్, విజయ్ నగర్ కాలనీ, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సంజీవరెడ్డి నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు, సంగారెడ్డి, జోగిపేట్, పెద్ద శంకరం పల్లి,  మద్నూర్ మీదుగా రాహుల్ గాంధీ  యాత్ర మహరాష్ట్రలోకి ప్రవేశించనుంది. 

also read:భార‌త్ జోడో యాత్ర దేశ భ‌విష్యత్తును మారుస్తుంది: రేవంత్ రెడ్డి

గత నెల 7 వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను  ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ, తమిళనాడు,కేరళ రాష్ట్రాల గుండా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది.కర్ణాటక రాష్ట్రం నుండి పాదయాత్ర తెలంగాణ  రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. ప్రతి రోజూ కనీసం 23 కిలోమీటర్ల దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.దేశంలో ప్రజలను సమైక్యంగా ఉంచేందుకు గాను ఈ యాత్ర సాగిస్తున్నట్టుగా రాహుల్ గాంధీ తెలిపారు. ఈ యాత్ర సాగుతున్న సమయంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

click me!