అందుకే టీఆరెస్ పార్టీ గెలిచింది.. పొన్నం అనుమానాలు

By Prashanth MFirst Published Jan 25, 2020, 5:41 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆరెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా అధికారాన్ని అందుకుంది. అయితే ప్రతిపక్షాలు ఈ రిజల్ట్స్ తో షాక్ కి గురవుతున్నాయి. రిజల్ట్ ఏ రేంజ్ లో ఎవరు ఊహించలేదు. ఇక ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు.

నేడు వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆరెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా అధికారాన్ని అందుకుంది. అయితే ప్రతిపక్షాలు ఈ రిజల్ట్స్ తో షాక్ కి గురవుతున్నాయి. రిజల్ట్ ఏ రేంజ్ లో ఎవరు ఊహించలేదు. ఇక ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు.

ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో సైనికుడిలా పోరాడిన ఒడిన కాంగ్రెస్ అభ్యర్థులకు సలాం ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికలను అనేక ప్రలోభాలు చూపించి టీఆరెస్ పార్టీ గెలిచింది. ఇండిపెండెంట్ లు ఆదికంగా గెలిచారంటే ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేఖ ఉంది. క్యాంప్ లు పెట్టి టీఆరెస్ అభ్యర్థులను దాచి పెట్టారు .చట్ట విరుద్ధంగా క్యాంప్ లు పెడితే ఎన్నికల సంఘం కూడా మౌనం గా ఉంది.

రేపు మున్సిపాలిటీ ల్లో అన్ని పన్నులు పెంచబోతున్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది.ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రెబెల్స్ ని తిరిగి తీసుకోము అన్న కెటియార్ ఇప్పుడు అదే మాట మీద ఉంటారా. వేములవాడ 17 వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఒక్క ఓటు రాకపోవడం పై అనుమానాలు ఉన్నాయ్. అంతర్గత విచారణ తో పాటు అధికారుల విచారణ కోసం పిర్యాదు' చేస్తామని అన్నారు.

click me!