రాజేంద్ర నగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి ఆ పార్టీపై తిరుగుబాటు ప్రకటించాడు. పొత్తులో భాగంగా ఆ సీటు టిడిపి కేటాయించడంతో ఇప్పటికే ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తన అనుచరులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి శంషాబాద్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు.

పార్టీ కార్యలయం వద్దకు భారీగా చేరుకున్న కార్తిక్ రెడ్డి అనుచరులు అక్కడ జెండా దిమ్మెను పగలగొట్టారు. అంతేకాకుండా అక్కడే వున్న కార్తిక్ తల్లి సబితా ఇంద్రారెడ్డి కి చెందిన ప్లెక్సీలను కూడా చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాజేంద్ర నగర్ సీటు తనకిస్తారో లేక రాజీనామా ఆమోదిస్తారో తేల్చుకోవాలని కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. తనతో పాటు రాంజేంద్ర నగర్ లోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజీనామా పంపిస్తామని...వాటిని ఆమోదిస్తారో లేక తనకు భీపామ్ పంపిస్తారో నిర్ణయం తీసుకోవాలన్నారు. తనను కాదని టిడిపికి ఎవరితో ఓట్లేసి గెలిపించుకుంటారో గెలిపించుకోండంటూ కార్తిక్ రెడ్డి సవాల్ విసిరారు.
మరిన్ని వార్తలు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా
రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు