''కేసీఆర్‌తో కాంగ్రెస్ సీనియర్లు కుమ్మక్కు...అందువల్లే డమ్మీలకు సీట్లు''

By Arun Kumar PFirst Published Nov 11, 2018, 11:31 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థలు ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇంకా అభ్యర్థుల ప్రకటన కూడా వెలువడక ముందే పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఇక తమకు టికెట్ రాదని భావిస్తున్న నాయకులు బహిరంగంగానే పార్టీ అధినాయకత్వం, తెలంగాణ నాయకులపై బహిరంగ  విమర్శలకు దిగుతున్నారు. 
 
ఇలా టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై  తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీఆర్ తో కుమ్మకయ్యారని ఆరోపించాడు. అందువల్ల కేసీఆర్ చెప్పిన డమ్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ తరపున టికెట్లు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇలా నలుగురైదుగురు  సీనియర్లు కేసీఆర్‌కు అమ్ముడుపోయారని గజ్జెల కాంతం  ఆరోపించారు.

కేసీఆర్ చెప్పడంవల్లే తనతో పాటు అద్దంకి దయాకర్, శ్రావణ్ లకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయనున్న జాబితాలో దాదాపు 20 మందికిపైగా అభ్యర్థులు కేసీఆర్ చెప్పినవారే ఉంటారని గజ్జెల కాంతం తెలిపారు.   

ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం  ఈ విషయాన్ని గుర్తించి నిజాయితీతో పార్టీకోసం పనిచేసే నాయకులకు టికెట్లివ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలోని కోవర్టులుగా పనిచేస్తున్న వారి గురించి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళతామని గజ్జెల కాంతం స్పష్టం చేశారు.  

click me!