తెలంగాణ డిజిపి దృష్టికి కాంగ్రెస్ నాయకుల కేసులు

By Arun Kumar PFirst Published Sep 14, 2018, 8:30 PM IST
Highlights

తెలంగాణలో ప్రతిపక్షాలను దెబ్బతీయాలనే కుట్రలో బాగంగా కాంగ్రెస్ నాయకలను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. తమపై నమోదయిన పోలీసు కేసులను వారు శుక్రవారం డిజిపి మహేంధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు అపద్దర్మ ప్రభుత్వ సూచనల మేరకే ఇలా కేసులు బనాయిస్తున్నారని డిజిపికి వివరించారు. ఈ కేసుల గురించి లిఖిత పూర్వకంగా మహేంధర్ రెడ్డికి పిర్యాదు చేశారు.

మనుషుల అక్రమ రవాణా కేసులో ఇప్పటికే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు రేవంత్ రెడ్డిపై, బెదిరింపుల కేసు గండ్ర వెంకటరమణా రెడ్డిపై, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూన శ్రీశైలం గౌడ్ పై వరుసగా నమోదయ్యాయి.. దీంతో ప్రభుత్వం కుట్రపూరితంగా ఇలా కేసులు పెడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం కాంగ్రెస్ నాయకులు కోదండ రెడ్డి, దాసోజు శ్రవణ్, కూన శ్రీశైలం గైడ్ డిజిపి ని కలిశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలంగౌడ్ డిజిపికి తనపై పెట్టిన కేసు గురించి వివరించారు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకే పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారని డిజిపికి ఫిర్యాదు చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ తనపై ఎస్సీ, ఎస్టీల్లో దురభిప్రాయం కలిగేలా చేస్తున్నారని వాపోయాడు. ఇందకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీశైలం గైడ్ డిజిపిని కోరారు.

click me!