రాజా సింగ్ ఎక్కడ కనిపిస్తే అక్కడే చితకబాదండి: ముస్లింలకు కాంగ్రెస్ లీడర్ పిలుపు

By Mahesh KFirst Published Aug 24, 2022, 7:59 PM IST
Highlights

మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చితకబాదండి అని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ముస్లింలను ఉద్దేశించి అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండన ఆయన ఇచ్చిన పిలుపు కలకలం రేపుతున్నది.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతులోకి తీసుకోవాలని ఆయన ముస్లింలకు పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ ఎక్కడ కనిపిస్తే అక్కడే చితకబాదండని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వెంటనే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొహమ్మద్ ప్రవక్త ముస్లింలకు హీరో అని పేర్కొన్నారు.

టీ రాజా సింగ్ విభజన రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాడని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఆయనను వెంటనే జైలులో పెట్టాలన్నారు. రాజా సింగ్ వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొహమ్మద్ ప్రవక్త తమ హీరో అని వివరించారు. ఒక వేళ ఆయన క్షమాపణలు చెప్పకుంటే ఆయన ఎక్కడ కనపడితే అక్కడే చికతబాదాలని హైదరాబాద్‌లోని ప్రతి ముస్లింలకు తాను చెప్పాలని అనుకుంటున్నట్టు వివరించారు. తాము చట్టాన్ని చేతుల్లోకి తీసుకోగలమని, ఒక సారి కాదు.. ఎక్కువ సార్లు తీసుకోగలమని బెదిరించారు.

మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వ్యాఖ్యల తర్వాత హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ ఆందోళనలు జరిగాయి.

పది నిమిషాల నిడివితో ఉన్న వీడియోను రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో ఈ వివాదం చోటు చేసుకొంది.ఈ వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలున్నాయని ఎంఐఎం ఆరోపిస్తుంది. మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని ఎంఐఎం ఆరోపణలు చేస్తుంది.ఈ విసయమై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తుంది. 

 వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నుండి రాజాసింగ్ ను బీజేపీ నిన్న సస్పెండ్ చేసింది. బీజేపీ శాసనసభపక్ష పదవి నుండి కూదా తప్పించింది. ఈ వ్యాఖ్యల విషయంలో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. సెప్టెంబర్ 2 లోపుగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కూడా బీజేపీ నాయకత్వం రాజాసింగ్ ను ఆదేశించింది

రాజాసింగ్ వీడియో నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం నాడు చర్చించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సహాల పలువురు పోలీసు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు సీఎం కేసీఆర్ సూచించారు.

click me!