అసంతృప్తితోనే దూరం... బిజెపిలో చేరిక ప్రచారంపై అంజన్ కుమార్ క్లారిటీ

By Arun Kumar PFirst Published Nov 19, 2020, 2:47 PM IST
Highlights

కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. 

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. రాజకీయ లబ్ది కోసం కొందరు కావాలనే తాను బీజేపీలోకి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని... ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

''గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. అంతేగాని బిజెపిలో చేరడానికే తాను కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నానన్న ప్రచారంలో నిజం లేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వదిలి వేరే ఏ పార్టీలోకి వెళ్లబోను'' అని అంజన్ కుమార్ తెలిపారు. 

read more జీహెచ్ఎంసీ ఎన్నికలు: 29 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

ఇక ఇలాంటి ప్రచారాలతో ప్రత్యర్థులు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నా గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. బుధవారమే మొదట 29 మందితో తొలి జాబితాను ప్రకటించగా ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మరో 16 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇలా ఒకేరోజు 45మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.  

ఇవాళ గురువారం మరికొన్ని డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ సిద్దమయ్యింది. నామినేషన్ వేయడానికి చివరి రోజయిన శుక్రవారం మొత్తంగా 150 డివిజన్లలో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ చూస్తోంది. 

click me!