తెలంగాణ పీసీసీ కొత్త కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందికి చోటు కల్పించింది.
తెలంగాణ పీసీసీ కొత్త కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందికి చోటు కల్పించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని 26 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు కూడా ప్రకటించింది. అలాగే 24 మంది ఉపాధ్యక్షులుగా, 84 మందిని జనరల్ సెక్రటరీలుగా నియమించింది. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, జగ్గారెడ్డిలను అపాయింట్ చేసింది. ఈ కొత్త కమిటీల సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు(వీహెచ్), పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, టీ జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, మధుయాష్కి గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లకు చోటు కల్పించారు.
Hon'ble Congress President has approved the proposal of constitution of the Pradesh Executive Committee of the Telangana Pradesh Congress Committee, as follows, with immediate effect. pic.twitter.com/DDGgLeBH4f
— INC Sandesh (@INCSandesh)
ఇక, పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రేవంత్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు ఈ కొత్త కమిటీల్లో పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ చోటు కల్పించలేదు.