చంద్రబాబు డబ్బుని పంచుకున్నారు: ఉత్తమ్, భట్టిపై ఎమ్మెల్యే ఆరోపణలు

Siva Kodati |  
Published : Jun 12, 2019, 03:46 PM IST
చంద్రబాబు డబ్బుని పంచుకున్నారు: ఉత్తమ్, భట్టిపై ఎమ్మెల్యే ఆరోపణలు

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

ఉత్తమ్, భట్టి ఇద్దరూ తెలంగణ ద్రోహులని...ఇప్పుడు దీక్షలు చేస్తున్న ఈ నేతలు, నాడు తెలంగాణ కోసం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి డబ్బులు తెచ్చుకుని ఉత్తమ్, భట్టి పంచుకున్నారని చిరుమర్తి ఆరోపించారు.

దళిత ఎమ్మెల్యేలను గౌవరించే సంస్కారం భట్టికి లేదని.. కాంగ్రెస్‌లో ఉత్తమ్, భట్టి ముఖ్యమంత్రుల్లా ఫీల్ అవుతున్నారని లింగయ్య విమర్శించారు. తాము అమ్ముడు పోయామని రుజువు చేస్తే తక్షణం పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు.

ఒకవేళ రుజువు చేయలేకపోతే.. ఉత్తమ్, భట్టి తమ పదవులకు రాజీనామా చేస్తారా..? అని చిరుమర్తి సవాల్ విసిరారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు అంశంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు. తనకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని లింగయ్య స్పష్టం చేశారు.     

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!