ఆ కాంగ్రెస్ నేతకు వింత అనుభవం... టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారే.. (వీడియో)

By Arun Kumar P  |  First Published Nov 7, 2023, 2:21 PM IST

కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వింత అనుభవం ఎదురయ్యింది. మొదటి లిస్ట్ ఆయనకు టికెట్ దక్కగా ప్రచారాన్ని ప్రారంభించి నామినేషన్ కు సిద్దమవుతుండగా క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 


హైదరాబాద్ : ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది... నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది... అధికార బిఆర్ఎస్ జెట్ స్పీడుతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది... అయినా ఇంకా కాంగ్రెస్ పార్టీలో టికెట్ పంచాయితీ కొనసాగుతోంది. టికెట్ల కేటాయింపు కాంగ్రెస్ అధిష్టానికి పెద్ద తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ లో కన్ప్యూజన్ కొనసాగుతున్నట్లు వనపర్తి నియోజకవర్గ పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.  

వనపర్తి కాంగ్రెస్ టికెట్ కోసం చిన్నారెడ్డి, మెఘారెడ్డి పోటీపడ్డారు. అయితే మొదట కాంగ్రెస్ పార్టీ టికెట్ చిన్నారెడ్డికి దక్కింది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లోనే ఆయన పేరు ప్రకటించింది కాంగ్రెస్. దీంతో నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన చిన్నారెడ్డి ఎన్నికల కోసం అన్నిఏర్పాట్లు చేసుకున్నాడు. నామినేషన్ వేయడానికి సిద్దమవుతున్న సమయంలో ఆయన కాంగ్రెస్ అదిష్టానం షాకిచ్చింది. 

Latest Videos

undefined

సోమవారం రాత్రి వెలువడిన మూడో జాబితాలో మరోసారి వనపర్తి పేరు కనిపించింది. ఈసారి చిన్నారెడ్డి కాకుండా మేఘారెడ్డి పేరు వుంది. అంటే చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకుని మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించిందన్నమాట. ఇలా తనకు టికెట్ ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో చిన్నారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 

వీడియో

వనపర్తి టికెట్ వెనక్కి తీసుకోవడంతో చిన్నారెడ్డి వర్గీయుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. దీంతో వారు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. గాంధీ భవన్ ముందు కూర్చుని చిన్నారెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. వనపర్తి టికెట్ ముందుగా ప్రకటించినట్లే చిన్నారెడ్డికే ఇవ్వాలని వారు కోరుతున్నారు. 

Read More  ఆ రెండు సీట్లలో వేరేవారికి టిక్కెట్ల కేటాయింపు: అసంతృప్తిలో దామోదర, కీలక నిర్ణయానికి చాన్స్

టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఈ ఏడాది మార్చిలోనే బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు చిన్నారెడ్డి. అప్పటినుండి నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఎన్నికల కోసం అంతా సిద్దంచేసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు మొదట ఆయనకే టికెట్ కేటాయించిన కాంగ్రెస్ ఏమయ్యిందో తెలీదు వెనక్కితగ్గింది. తాజాగా వనపర్తి టికెట్ మెఘారెడ్డికి ఇస్తున్నట్లు ప్రకటించింది. 
 

click me!