కాంగ్రెస్‌ది కుల రాజకీయం.. బీజేపీది మత రాజకీయం: వైఎస్ షర్మిల

Published : May 28, 2022, 07:15 PM IST
కాంగ్రెస్‌ది కుల రాజకీయం.. బీజేపీది మత రాజకీయం: వైఎస్ షర్మిల

సారాంశం

కాంగ్రెస్, బీజేపీలపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుంటే.. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర యూనిట్ చీఫ్ బండి సంజయ్‌లు కుల, మత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తాము అన్ని వర్గాలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.  

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలను విమర్శించారు. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తున్నదని, బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని షర్మిల ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇరువురూ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ఒక దొంగ అని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రెడ్డి సమాజానికి అధికారం ఇవ్వాలని, ఇతర కులాలు నాయకత్వానికి పని రావని మాట్లాడటం ఆక్షేపనీయం అని అన్నారు. రేవంత్ రెడ్డి ఇలా బరితెగించి మాట్లాడుతూ అధిష్టానం కనీసం చర్యలు కూడా తీసుకోలేదని ఫైర్ అయ్యారు. సస్పెండ్ చేయలేదని, కనీసం మందలించలేదని అన్నారు.

అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యల మాత్రం సరైనదని, వైఎస్సార్‌తోనే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారాన్ని చేపట్టగలిగిందని అన్నారు. వైఎస్సార్ ఏనాడు కులాల పేరిట రాజకీయాలు చేయలేదని, అన్ని కులాలు, మతాలను గౌరవించాడని వివరించారు. అంతేకానీ, రేవంత్ రెడ్డి వంటి బ్లాక్ మెయిలర్‌ను తెలంగాణ ప్రజలు గౌరవించదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నారని, మసీద్‌లను కూలగొడతామని బండి సంజయ్ మాట్లాడుతున్నారని అన్నారు. శవాలు ఉంటే ముస్లింలవి అంటా.. శివుడు ఉంటే హిందువులవి అంటా.. ఉర్దూ బాష కూడా లేకుండా చేస్తారని దారుణంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఇలా మాట్లాడుతుంటే కనీస చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా? అని అడిగారు.

మతాలను అడ్డం పెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నదని, బండి సంజయ్ చేతిలో బీజేపీ పార్టీ.. పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగానే ఉన్నదని వివరించారు. అగ్గిపెట్టి చలి కాచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ కూడా ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని, వారికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన వండ్లను కొన్నారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? ఎందుకు బీజేపీకి చాన్స్ ఇవ్వాలని నిలదీశారు.

బీజేపీ ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నారని, అది మోడీ, అమిత్ షాలతో కూడా కాదని, తాము అన్ని వర్గాలకు అండగా నిలబడతామని వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్