జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ హవా: బీటలు వారిన కాంగ్రెస్, టీడీపీ కోటలు

By narsimha lodeFirst Published Dec 26, 2018, 2:58 PM IST
Highlights

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు ఉనికిని కోల్పోతున్నాయి. టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది.  


కరీంనగర్:జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు ఉనికిని కోల్పోతున్నాయి. టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది.  తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ అదే పంథాను కొనసాగించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  విపక్షాలను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా తమ వైపు ఆకర్షించేందుకు  అధికార టీఆర్ఎస్ చేపట్టిన వ్యూహం ఫలించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో  కూడ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ జిల్లాలో ఆశించిన ఫలితాలను కూడ రాబట్టలేదు.

2014 ఎన్నికల్లో  జగిత్యాల నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ సంజయ్‌కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా ఈ స్థానంలో  డాక్టర్ సంజయ్ కుమార్  భారీ మెజారిటీతో విజయం సాధించారు. 

ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా  బరిలోకి దిగిన జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ మద్దతుగా నిలిచారు. గతంలో ఈ స్థానం నుండి  ఎల్. రమణ లేదా జీవన్ రెడ్డి  విజయం సాధిస్తున్నారు. కాంగ్రెస్,టీడీపీలు కలిసినా కూడ ఈ స్థానంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోలేకపోయాయి.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం  పరిధిలోకి వచ్చే జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో  ఎంపీ కవిత విస్తృతంగా పర్యటించారు. ఈ సెగ్మెంట్‌లో  డాక్టర్  సంజయ్‌ను గెలిచించడంలో కవిత కీలకంగా వ్యవహరించారు. 

కోరుట్ల నుండి విద్యాసాగర్ రావు నాలుగోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ధర్మపురి నుండి కొప్పుల ఈశ్వర్ చివరి నిమిషంలో ఓటమి నుండి తప్పించుకొన్నారు. అతి తక్కువ మెజారిటీతో  ఆయన విజయం సాధించారు. అయితే దీని వెనుక పార్టీలోని కొందరు నేతల కుట్ర ఉందని ఈశ్వర్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.వేములవాడలో టీఆర్ఎస్  అభ్యర్థి చెన్నమనేని రమేష్ మరోసారి విజయం సాధించారు.

జగిత్యాలలో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు విజయం సాధిస్తున్నారు. మూడేళ్ల నుండి  జగిత్యాలపై టీఆర్ఎస్ కన్నేసింది. ఈ స్థానంలో  కాంగ్రెస్ పార్టీని  దెబ్బ కొట్టాలని టీఆర్ఎస్ వ్యూహన్ని రచించింది.ఈ వ్యూహన్ని కవిత అమలు చేశారు.జగిత్యాల నుండి  జీవన్ రెడ్డి ఆరు దఫాలు విజయం సాధించారు. కానీ, ఈ దఫా భారీ మెజారిటీతో ఆయన ఓటమి పాలు కావాల్సి వచ్చింది.


కోరుట్లలో కాంగ్రెస్‌ పార్టీ 2009 నుంచి బోణీ కొట్టలేకపోతుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మెట్‌పల్లి నియోజకవర్గం కోరుట్లగా మారింది. ఈ దఫా కూడ ఈ స్థానంలో  కాంగ్రెస్ పార్టీ  ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బుగ్గారం అసెంబ్లీ నియోజవకర్గం  నియోజకవర్గాల పునర్విభజనలో  ధర్మపురిగా మారింది. ఈ స్థానంలో  వరుసగా టీఆర్ఎస్ విజయం సాధించింది.

జగిత్యాల టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ గతంలో ప్రాతినిథ్యం వహించారు. ఈ జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు సాగర్ రావు నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో  టీడీపీ ఒక్క స్థానంలో కూడ పోటీ చేయకపోవడం ఆ పార్టీ క్యాడర్‌‌ను ఇబ్బందిలో పెట్టింది. దీంతో  కొందరు టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.


 

click me!