
హిమాయత్ నగర్ : Auto charges పెంచాలని కోరుతూ పలు ఆటో సంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో bandhకు పిలుపునిచ్చాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న Auto driver లను ఆదుకునేందుకు ఛార్టీలు పెంచాలని, కొత్తగా మరో 20వేల పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్ యూనియన్స్ జేఏసీ నేతలు వెంకటేశం, సత్తిరెడ్డి, మల్లేష్ గౌడ్, మారయ్య, అమానుల్లాఖాన్ తదితరులు డిమాండ్ చేశారు. సోమవారం హిమాయత్ నగర్ లోని సత్యనారాయణరెడ్డి భవన్ లో భవిష్యత్ కార్యాచరణపై ఆటో, క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. నగరంలో ఎనిమిదేళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
కరోనా, లాక్ డౌన్ కారణంగా క్యాబ్ ఆటోలకు డిమాండ్ తగ్గిపోయిందని కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆటో చార్జీలు కనీసం రూ. 40, కిలోమీటర్ కు రూ.25 చొప్పున పెంచాలని కోరారు. సిఎన్జి తో నడిచే 20 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛన్లు, ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇవ్వాలని అన్నారు. ఇతర జిల్లాల్లోని ఆటోలు హైదరాబాద్ నగరంలో తిరగకుండా నిషేధం విధించాలన్నారు.