బండి సంజయ్ అరెస్ట్ : కేసీఆర్, కేటీఆర్ లపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదుల వెల్లువ...

By SumaBala Bukka  |  First Published Jan 5, 2022, 8:22 AM IST

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి  కేటీఆర్ లపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  


తెలంగాణ ముఖ్యమంత్రి KCR, మంత్రి KTRలపై పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు Bandisanjay అరెస్టుకు నిరసనగా, ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఫిర్యాదుల్లో కేసీఆర్, కేటీఆర్ ల మీద ఆరోపించారు.

Latest Videos

undefined

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి  కేటీఆర్ లపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  

చట్టానికి ఎవరూ కూడా అతీతులు కారని, వీరిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎంపీ అరవింద్ ఫేస్ బుక్ వాల్ మీదా ఈ వార్త షేర్ చేశారు. 

కాగా, హైదరాబాద్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi sanjay  అరెస్ట్ ను నిరసిస్తూ bjp తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మౌన దీక్ష చేపట్టారు సీనియర్ నేతలు.  గోషామహల్ ఎమ్మెల్యే Raja singh, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్,  ఎండల లక్ష్మీనారాయణ,ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి సహా  పలువరు నేతలు మౌన దీక్షలో పాల్గొన్నారు.

317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగిన బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీ కార్యాలయాల్లో మౌన దీక్షలకు దిగాలని ఆ పార్టీ  నిర్ణయం తీసుకొంది.

ఈ నిర్ణయం మేరకు  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలు మౌన దీక్షను చేపట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో  పార్టీ నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీజేపీ నేతలు మౌన దీక్షను ఎంచుకొన్నారు. మరోవైపు సాయంత్రం ఇవాళ క్యాండిల్ ర్యాలీకి కూడా బీజేపీ నాయకత్వం పిలపునిచ్చింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు bail ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను  Karimnagar Court స్వీకరించింది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.  సోమవారం నాడే బండి సంజయ్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో  ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్ ను బండి సంజయ్ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. 

మంగళవారం ఈ బెయిల్ పిటిషన్ కు కోర్టు నెంబర్ ను కేటాయించనున్న నేపథ్యంలో బుధవారం  ఈ పిటిషన్ పై  విచారణ జరిగే అవకాశం ఉంది. కరీంనగర్ పోలీసులు  బండి సంజయ్ పై తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని కూడా సంజయ్ తరపు న్యాయవాదులు మరోసారి కోర్టు దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 333 సెక్షన్  కింద బండి సంజయ్ పై కేసులు నమోదు చేయడంపై కూడా పోలీసుల తీరును బండి సంజయ్ తరపు న్యాయవాదులు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకురానున్నారు.

click me!