బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలి:పృథ్వి

Published : Nov 26, 2018, 08:59 PM ISTUpdated : Nov 26, 2018, 09:02 PM IST
బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలి:పృథ్వి

సారాంశం

 కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ పై టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ సెటైర్లు వేశాడు. అంటే సినిమాలో కాదండోయ్. పాలిటిక్స్ లో పొలిటికల్ పంచ్‌లు విసిరారు. ఓ మీడియాతో మాట్లాడిన పృథ్వి బండ్ల గణేష్ ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉంటుందంటూ పంచ్ లు వేశారు.    

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ పై టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ సెటైర్లు వేశాడు. అంటే సినిమాలో కాదండోయ్. పాలిటిక్స్ లో పొలిటికల్ పంచ్‌లు విసిరారు. ఓ మీడియాతో మాట్లాడిన పృథ్వి బండ్ల గణేష్ ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉంటుందంటూ పంచ్ లు వేశారు.  

తెలంగాణలో మహాకూటమి గెలవకపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో మెడ కోసుకుంటానని గణేశ్ అన్న వ్యాఖ్యలపై స్పందించిన పృథ్వి ఆ విషయాన్ని ముందు పోలీసులకు చెప్పాలన్నారు.  ఆయన్ను కాపాడమని పోలీసులకు చెప్పాలి ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకోవాలి అంటూ నవ్వులు కురిపించారు. 

అంతేకాదు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో కూడా గణేశ్ ఫొటో తీయించుకునే శక్తి ఉన్నోడంటూ మరో పంచ్ లు వేశారు. అయితే తనకు అంత శక్తి లేదన్నారు. గణేశ్ మంచి ప్రొడ్యూసరని, తనకు మంచి మిత్రుడని అభిప్రయాపడ్డారు. ఆయన రాజకీయాల్లోకి రావడమే ఆశ్చర్యంగా ఉందన్నారు పృథ్వీ.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌