ఏఐఎంఐఎం రెబల్ అభ్యర్థి తండ్రి అరెస్ట్...జాబ్లీహిల్స్‌లో తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 26, 2018, 8:56 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గతంలో పార్టీలో వుండి సీటు ఆశించి భంగపడి రెబల్ గా బరిలోకి దిగిన అభ్యర్థులను ఇంకా బుజ్జగించే ప్రయత్నాల్లో ముఖ్య పార్టీలున్నాయి. ఇప్పటివరకు సామ దాన ఉపాయాలను ప్రయోగించిన పార్టీలు ఇప్పుడు దండోపాయాన్ని ప్రయోగిస్తున్నారు. దీంటో భాగంగా ఎంఐఎం రెబల్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయమని బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో జూబ్లీహిల్స్ లోని అతడి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
 
ఈ అరెస్ట్ తో నవీన్ యాదవ్ కుటుంబంతో పాటు అతడి అనుచరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.  టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయకుంటే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని గతంలో బెదిరించారని...అయినా తాము వినకపోవడంతో ఇలా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నట్లు వారు తెలిపారు.  

శ్రీశైలం యాదవ్ ను అరెస్ట్ చేయడానికి  ఇంటికి వెళ్లిన టాస్క్ పోర్స్ పోలీసులను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయినా పోలీసులు అతన్ని సికింద్రబాద్ లోని టాస్క్ ఫోర్స్ కార్యలయనికి తరలించారు.   

ఈ అరెస్ట్ గురించి తెలుసుకున్న నవీన్ యాదవ్ అనుచరులు, సపోర్టర్లు అతడి ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వీడియో 

"

click me!